![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1021 లో... రాజు డల్ గా ఉంటాడు. అప్పుడే ఇందు వస్తుంది. డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు.. డబ్బులోనే సంతోషం ఉందని అనుకుంటావని ఇందు అనగానే నీకేం తెలుసు మా మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు నువ్వు డబ్బులో పుట్టి పెరిగావ్ కాబట్టి నీకు డబ్బుల గురించి తెలియదని రాజు తనకి డబ్బు గురించి క్లాస్ తీసుకుంటాడు. వీడు డబ్బు పిచ్చోడు కానీ మంచివాడే అని ఇందు అనుకుంటుంది. మరొకవైపు ఐశ్వర్యకి తన ఫ్రెండ్ రాహుల్ ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇవ్వకుండా మీ ఆంటీ దగ్గరికి వచ్చి డబ్బు వసూల్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత రేఖ దగ్గరికి ఐశ్వర్య వచ్చి.. ఇందు కిడ్నప్ అయి చాలా రోజులు అవుతుంది కదా .. డబ్బు అరెంజ్ అయిందా ఆంటీ అని రేఖని అడుగుతుంది. లేదు ప్రెజెంట్ ఇరవై లక్షలున్నాయని రేఖ అంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడానికి అవి సరిపోతాయని ఐశ్వర్య అనుకొని కిడ్నాపర్ కి ఫోన్ చేసి ఇరవై లక్షలు ఉన్నాయని చెప్పండి డబ్బు అవసరం అయితే వాడే ఒప్పుకుంటాడని ఐశ్వర్య అంటుంది. దాంతో రాజుకి రేఖ ఫోన్ చేసి ఇరవై లక్షలున్నాయని అంటుంది. నీకు ఎలా కన్పిస్తున్నా.. నాకు కోటి కావాలని ఫోన్ కట్ చేస్తాడు. వీడికి ఎక్స్ ట్రాలు బాగా అవుతున్నాయని రాజుకి ఐశ్వర్య ఫోన్ చేసి.. ఒరేయ్ ఇప్పుడు మా ఆంటీ దగ్గర ఇరవై లక్షల కంటే ఎక్కువ లేవు.. ఇప్పుడు అవి తీసుకుందామని ఐశ్వర్య అంటుంది. దాంతో సాహో అన్న మాటలు గుర్తుచేసుకొని సరే అంటాడు.
ఆ తర్వాత రేఖకి రాజు ఫోన్ చేసి నువ్వు చెప్పిన అమౌంట్ నాకు ఒకే ఎక్కడికి రావాలో చెప్తానని రాజు అనగానే రేఖ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏంట్రా అలా ఒప్పుకున్నావని లక్కీ అంటాడు. ఇప్పుడు మనకి ఆ సాహో గానీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలని రాజు అంటాడు. ఆ తర్వాత డబ్బుతో రేఖ, భూషణ్ బయల్దేరతారు. మరొకవైపు ఇందుని రాజు గుడికి తీసుకొని వస్తాడు. లక్కీని మాస్క్ వేసుకోమని డబ్బు తీసుకొని రమ్మని రాజు వాళ్ళ దగ్గరికి లక్కీని పంపిస్తాడు. ఆ తర్వాత ఇందుకి ఎదురుగా గుళ్లో రేఖ ఉంటుంది. తరువాయి భాగంలో ఇందుని లాక్కొని రేఖ వెళ్తుంటే దూరం నుండి రాజు చూసి బాధపడతాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని రాజుని లక్కీ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |